Saturday, January 11, 2025

నీట్ అధికారుల తప్పిదం విద్యార్థికి శాపం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రెండు రోజుల కితం వెలువడిన నీట్ పరీక్ష ఫలితాల్లో అధికారుల తప్పిదం ఓ విద్యార్థికి శాపంగా మారింది. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పెట్ కి చెందిన బొమ్మిడిక శివప్రసాద్ రెడ్డి అనే విద్యార్థికి 462 మార్కులకు 280 మార్కులు వేశారు. అనుమానం వచ్చిన విద్యార్థి తల్లిదండ్రులు సంబంధింత వెబ్ సైట్ నుండి ఓ ఎమ్ అర్ షీట్ ను డౌన్ లోడ్ చేసుకుని కీ షీట్ లో చెక్ చేసుకోగా 462 మార్కులు కరెక్ట్ గా ఉండటంతో ఆశ్చర్యానికి గురైయ్యారు. గత సంవత్సరం నీట్ పరీక్ష రాయగా స్కోర్ తక్కువగా రావడం తో ఈ సారిలాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. తాము పేద రైతు కుటుంబం కావడం తో డబ్బులు కట్టలేక కష్టపడి చదివితే అధికారులు నిర్లక్షంతో తమ కుమారుడి జీవితం అంధకారంలో పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News