Saturday, December 28, 2024

డబ్బున్నోళ్లు విద్యా వ్యవస్థను కొనేస్తున్నారు: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ విషయంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాలలో నీట్ పేపర్ లీకేజీపై చర్చ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. డబ్బున్నోళ్లు విద్యా వ్యవస్థను కొనేస్తున్నారని, నీట్ పేపర్ లీక్ పెద్ద సమస్యగా మారిందని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనను తప్ప అందరినీ తప్పుపడుతున్నారని రాహుల్ చురకలంటించారు.

నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిఎంకె ఎంపి కళానిధి వీరస్పా డిమాండ్ చేశారు. నీట్ పరీక్షకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎంపి మాణిక్యం ఠాగూర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News