Monday, December 23, 2024

సెప్టెంబర్ 1 నుంచి నీట్-పిజి కౌన్సెలింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నీట్(పిజి) కౌన్సెలింగ్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికార వర్గాలు శనివారం తెలిపాయి. నీట్-పిజి 2022 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ఆల్ ఇండియా కోటా సీట్లు, రాష్ట్ర మెడికల్, డెంటల్ కాలేజీలలు,సెంట్రల్, డీమ్డ్ యూనివర్సిటీలలో తమకు నచ్చిన కోర్సులు, కాలేజీలలో అడ్మిషన్లు పొందవచ్చు. మెడికల్, డెంటల్ కాలేజీలకు సంబంధించి అన్ని కేంద్ర యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, 50 శాతం ఆల్ ఇండియా కోటా సీట్లు, 50 శాతం రాష్ట్ర కోటా సీట్లకు ఒకేసారి పిజి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పరిధిలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసిసి) ఆన్‌లైన్ పద్ధతిలో కౌన్సెలింగ్ నిర్వహిస్తుందని వారు తెలిపారు.

NEET-PG 2022 Counselling from Sept 1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News