Friday, January 24, 2025

నీట్ పిజి కౌన్సెలింగ్ ప్రారంభానికి వీలు కల్పించండి

- Advertisement -
- Advertisement -

ఆరోగ్య మంత్రిత్వశాఖ జోక్యం చేసుకోవాలి
నడ్డాకు ఐఎంఎ లేఖ

న్యూఢిల్లీ : విద్యార్థులు, ఆరోగ్య సేవల వ్యవస్థ ప్రయోజనాలు పరిరక్షిస్తూ నీట్ పిజి 2024 కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు కావడానికి వీలుగా మధ్యంతర చర్యలు అన్వేషించాలని ప్రభుత్వానికి ఇండియాన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) మంగళవారం విజ్ఞప్తి చేసింది. నీట్ పిజి 2024 కౌన్సెలింగ్ ప్రక్రియలలో జాప్యం వల్ల అనిశ్చితి, పెరుగుతున్న ఆందోళనల గురించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జెపి నడ్డా దృష్టికి తీసుకువస్తూ ఐఎంఎ ఆయనకు లేఖ రాసింది. సుప్రీం కోర్టులో ప్రస్తుతం సాగుతున్న కేసు కారణంగా నీట్ పిజి 2024 కౌన్సెలింగ్ ప్రక్రియ నిలచిపోయిన విషయం విదితమే. ‘కౌన్సెలింగ్ ప్రక్రియలో జాప్యం వల్ల దేశవ్యాప్తంగా వేలాది మంది నీట్ పిజి అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు’ అనిఐఎంఎ తెలిపింది.

పిజి వైద్య సీట్లకు అర్హత పొందేందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన ఆ అభ్యర్థులు న్యాయ విచారణ కారణంగా తమ భవిష్యత్తు గురించి చాలా కాలంగా అనిశ్చితిని ఎదుర్కొంటున్నారని ఐఎంఎ తన లేఖలో తెలియజేసింది. అదిఆరోగ్య సేవల సంస్థల పని తీరును కూడా ప్రభావితం చేస్తున్నదని, ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో మెడికల్ ప్రొఫెషనల్స్ అందుబాటులో ఉండేందుకు పిజి విద్యార్థులను సకాలంలో చేర్చుకోవడం కీలకమని ఐఎంఎ సూచించింది. ‘న్యాయ ప్రక్రియను, చట్టబద్ధమైన స్పష్టతను మేము పూర్తిగా గౌరవిస్తున్నాం. అదే సమయంలో విద్యార్థుల విద్యావిషయక, వృత్తిపరమైన భవిష్యత్తు దెబ్బ తినకుండా చూసేందుకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జోక్యం చేసుకుని పరిష్కార మార్గాలు అన్వేషించడం ముఖ్యమని ఐఎంఎ భావిస్తోంది’ అని సంస్థ తన లేఖలో తెలియజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News