Friday, December 27, 2024

12 నుంచి నీట్‌-పిజి కౌన్సిలింగ్

- Advertisement -
- Advertisement -

Neet-PG counselling will start on January 12th

కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మాండవీయ

న్యూఢిల్లీ: నీట్‌-పిజి కౌన్సిలింగ్‌ను జనవరి 12 నుంచి ప్రారంభించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్‌సుఖ్‌మాండవీయ తెలిపారు. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. కొవిడ్‌పై పోరాడుతున్న సమయంలో దేశానికి ఇది బలాన్నిస్తుందంటూ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై మాండవీయ ఆదివారం హిందీలో ట్విట్ చేశారు. 202122 నీట్‌పిజి కౌన్సిలింగ్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కేంద్రం అందుకు సిద్ధమవుతోంది.

మెడికల్ పిజి కోర్సుల్లో ప్రవేశం విషయంలో ఒబిసిలకు 27 శాతం, ఇడబ్లూఎస్ కోటా కింద 10 శాతం రిజర్వేషన్లకు సుప్రీంకోర్టు అనుమతి ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నీట్‌పిజి ప్రవేశ పరీక్షను గతేడాది సెప్టెంబర్ 11న నిర్వహించారు. అదే నెల చివరి వారంలో ఫలితాలను వెల్లడించారు. అయితే, రిజర్వేషన్ల విషయంలో పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు కావడంతో కౌన్సిలింగ్ నిలిచిపోయింది. దేశవ్యాప్తంగా 45,000 మెడికల్ పిజి సీట్లకు కౌన్సిలింగ్ జరగనున్నది. నీట్‌పిజి కౌన్సిలింగ్ ఆలస్యం కావడం వల్ల తమపై పని భారం పెరుగుతున్నదంటూ రెసిడెంట్ డాక్టర్లు గత నెల దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News