Wednesday, January 22, 2025

ఆగస్టు 11న నీట్ పిజి ప్రవేశ పరీక్ష

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నీట్ పిజి 2024 ప్రవేశ పరీక్షను ఆగస్టు 11న రెండు షిఫ్ట్‌లలో నిర్వహించనున్నట్లు జాతీయ వైద్య శాస్త్ర పరీక్షల బోర్డు (ఎన్‌బిఇఎంఎస్) శుక్రవారం ప్రకటించింది. ఈ పరీక్షను జూన్ 23న నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. ‘జూన్ 22 నాటి ఎన్‌బిఇఎంఎస్ నోటీస్‌కు కొనసాగింపుగా నీట్ పిజి 2024 పరీక్ష తేదీని మార్చడమైంది.

పరీక్షను ఆగస్టు 11న రెండు షిఫ్ట్‌లలో నిర్వహిస్తాం. నీట్ పిజి 2024లో హాజరుకు అర్హతకు సంబంధించి కటాఫ్ తేదీ ఆగస్టు 15గానే కొనసాగుతుంది’ అని బోర్డు తెలియజేసింది. కొన్ని పోటీ పరీక్షల సమగ్రతపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ‘ముందుజాగ్రత్త చర్య’గా జూన్ 23న నిర్వహించవలసి ఉన్న నీట్ పిజి ప్రవేశ పరీక్షను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ జూన్ 22న వాయిదా వేసింది.

అటు పిమ్మట కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, ఎన్‌బిఇఎంఎస్ అధికారులు, దాని సాంకేతిక భాగస్వామి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్), జాతీయ వైద్య కమిషన్, సైబర్ సెల్ అధికారులతో పరీక్ష నిర్వహణకు ‘సుదృఢ’ విధానం మదింపునకు పలు సమావేశాలు జరిపారు. నీట్ పిజి ప్రవేశ పరీక్ష ప్రక్రియల దృఢత్వాన్ని కూలంకషంగా మదింపు వేయాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఎన్‌బిఇఎంఎస్ తన సాంకేతిక భాగస్వామి టిసిఎస్‌తో కలసి వైద్య విద్యార్థుల కోసం నీట్ పిజి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News