న్యూఢిల్లీ : పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల కోసం నిర్వహించాల్సిన ‘నీట్ పీజీ ప్రవేశ 2022’ పై ఓ తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పరీక్షను జులై 9 వ తేదీకి వాయిదా వేశామంటూ నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ పేరుతో ఓ నకిలీ సర్కులర్ బయటికొచ్చింది. ఇది వైరల్ అవడంతో అప్రమత్తమైన ప్రభుత్వం అవన్నీ తప్పుడు వార్తలని తెలిపింది. నీట్ పీజీ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేసింది. నిజానికి ఈ పరీక్ష ఈ ఏడాది మార్చి 12 నే జరగాల్సి ఉండగా, కొన్ని కారణాల దృష్టా మే 21 కి వాయిదా వేశారు. అయితే ఈ పరీక్షను మరోసారి వాయిదా వేయాలంటూ గత కొన్ని రోజులుగా విద్యార్ధుల నుంచి అభ్యర్థనలు వినిపిస్తున్నాయి.
దీనిపై కొందరు రాష్ట్రపతి రామ్‌నాధ్ కొవింద్ , ప్రధాని మోడీకి లేఖలు కూడా రాశారు. ఈ నేపథ్యంలో పరీక్షవాయిదాకు సంబంధించి ఓ సర్కులర్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏప్రిల్ 28 న నేషన్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ పేరుతో ఉన్న ఆ సర్కులర్‌లో పరీక్షను జులై 9 కి వాయిదా వేసినట్టు ఉంది. ఇది కాస్త అభ్యర్ధుల్లో గందరగోళం సృష్టించడంతో కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐటీ దీనిపై వాస్తవాలు తనిఖీ చేసింది. ఆ సర్కులర్ నకిలీదని, దాన్ని నమ్మొద్దని స్పష్టం చేసింది. ఈమేరకు ట్విట్టర్‌లో వెల్లడించింది. నీట్ పీజీ పరీక్షలో మార్పేమీ లేదని మే 21 నే జరుగుతుందని వివరించింది.
A #FAKE notice issued in the name of the National Board of Examinations claims that the NEET PG exam has been postponed & will now be conducted on 9th July 2022.#PIBFactCheck
▶️ The exam has not been postponed.
▶️ It will be conducted on 21 May 2022 only. pic.twitter.com/790mTsZypM
— PIB Fact Check (@PIBFactCheck) May 7, 2022