Saturday, November 23, 2024

నీట్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -
ఎపికి చెందిన బోరా వరుణ్ చక్రవర్తి,
తమిళనాడుకు చెందిన ప్రభంజన్ ఫస్ట్ ర్యాంకు
ఆలిండియా స్థాయిలో 15వ ర్యాంకు సాధించిన
తెలంగాణ విద్యార్థి కె.జి.రఘురామరెడ్డి

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నీట్ యుజి ఫలితాలు విడుదలయ్యాయి. మే 7న జరిగిన ఈ పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం రాత్రి విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోరా వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్ ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించారు. పంజాబ్‌కు చెందిన ప్రభంజన్ అగర్వాల్ ఆలిండియా స్థాయి 4వ ర్యాంకు సాధించినట్లు ఎన్‌టిఎ వెల్లడించింది.

ఈ ఫలితాలలో తెలంగాణకు చెందిన కె.జి.రఘురామరెడ్డి 15వ ర్యాంకు సాధించారు. నీట్‌కు అర్హత సాధించిన వారిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి గరిష్ట స్థాయిలో అభ్యర్థులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం భారత్‌తో పాటు విదేశాల్లోని పలు నగరాల్లో 4,097 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 20,87,449 మంది విద్యార్థులు హాజరు కాగా, 11,45,976 మంది ఉత్తీర్ణత సాధించారు. జూన్ 4న ప్రిలిమినరీ కీని విడుదల చేసిన ఎన్‌టిఎ, జూన్ 6వరకు విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన విషయం తెలిసిందే. వాటిని పరిగణనలోకి తీసుకున్న ఎన్‌టిఎ అధికారులు తాజాగా తుది సమాధానాల కీ తో పాటు ఫలితాలను విడుదల చేసింది.

Telangana toppers

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News