Monday, December 23, 2024

జి 20తో నీట్ ఎస్‌ఎస్ పరీక్ష వాయిదా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నీట్ సూపర్ స్పెషాల్టీ (ఎస్‌ఎస్ ) ఎగ్జామ్ 2023 ని వాయిదా వేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 8 నుంచి 10వరకూ జి 20 సదస్సు జరుగుతుంది. ఈ నేపథ్యంలో నీట్ పరీక్ష అభ్యర్థులకు ఇబ్బంది కలుగకుండా చేసేందుకు పరీక్షను వాయిదా వేశారు. సంబంధిత విషయాన్ని నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ( మెడికల్ సైన్సెస్) న్యూఢిల్లీ అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 9 , 10వ తేదీలలో ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. ఇప్పుడు వీటిని వాయిదా వేయడంతో రీషెడ్యూల్ త్వరలో ప్రకటిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News