Friday, November 22, 2024

రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులు

- Advertisement -
- Advertisement -

NEET state rankings released

టాప్‌టెన్‌లో ఆరుగురు బాలికలు, కాళోజి ఆరోగ్య వర్శిటీ ప్రకటన

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్య విద్యలో ప్రవేశాలకు నీట్ రాష్ట్రస్థాయి ర్యాంకులు విడుదలయ్యాయి. నీట్‌లో అర్హత సాధించిన మొదటి 50 స్థానాల్లో నిలిచిన వారి పేర్లను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం విడుదల చేసింది. ఈ నెల ఒకటవ తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) జాతీయస్థాయి నీట్ ర్యాంకులు విడుదల చేసిన విషయం తెలిసిందే. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన మృణాల్ కుట్టేరి రాష్ట్రంలోనూ మొదటి స్థానంలో నిలువగా, జాతీయ స్థాయిలో 16వ స్థానంలో ఖండవల్లి శశాంక్ ద్వితీయ స్థానంలో నిలిచారు.

రాష్ట్ర ర్యాంకుల్లో మొదటి 10 స్థానాల్లో ఆరుగురు బాలికలు ఉండగా, నలుగురు బాలురు ఉన్నారు. నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిగా చేసిన నమోదు ఆధారంగా ఈ జాబితా ప్రకటిస్తున్నామని వర్సిటీ వర్గాలు పేర్కొన్నారు. ఇది సమాచార నిమిత్తమేనని, విద్యార్థులు యూనివర్సిటీకి దరఖాస్తు చేసిన తర్వాతనే మెరిట్ జాబితాను విడుదల చేయడం జరుగుతుందని యూనివర్సిటీ వర్గాలు స్పష్టం చేశారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని యుజి కోర్సుల్లో ప్రవేశాలకు వర్సిటీ మొదట రిజిస్ట్రేషన్ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అభ్యర్థుల దరఖాస్తుల ఆధారంగా ధృవపత్రాలను పరిశీలించి యూనివర్సిటీ ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఈ మేరకు త్వరలో కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. ర్యాంకుల వారీగా అభ్యర్థుల వివరాలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నుండి రాష్ట్రానికి అందింది. ఆ డేటా ఆధారంగా రాష్ట్రానికి చెందిన వారీగా నమోదు చేసుకున్న అభ్యర్థుల వివరాలు ప్రకటించారు.

నీట్ కట్ ఆఫ్ స్కోర్ వివరాలు

నీట్‌లో అర్హతకు జనరల్,ఇడబ్ల్యూఎస్ కేటగిరీకి 50 పర్సంటైల్ కటాఫ్ మార్కులు 138 కాగా, ఒబిసి, ఎస్‌సి,ఎస్‌టిలకు 40 పర్సంటైల్, కటాఫ్ స్కోర్ 108గా నిర్థారించారు. అదేవిధంగా పిడబ్ల్యుడి అభ్యర్ధులకు 45 పర్సంటైల్, 122 కటాఫ్ స్కోర్‌గా ఉంది.

రాష్ట్రంలో నీట్ అర్హత సాధించిన టాప్‌టెన్ విద్యార్థుల జాబితా

1. మృణాల్ కుట్టేరి

2 ఖండవల్లి శశాంక్

3 కాసా లహరి

4 .ఏమని శ్రీనిజ

5.దాసిక శ్రీ నిహారిక

6 పసుపునూరి శరణ్య

7 బొల్లినేని విశ్వాస్ రావు

8. కన్నెకంటి లాస్య చౌదరి

9. గజ్జల సమీహన రెడ్డి

10. గాండ్ల ప్రమోద్ కుమార్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News