Thursday, January 23, 2025

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నీట్ విద్యార్థిని మృతి

- Advertisement -
- Advertisement -

ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టి లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నీట్ విద్యార్థిని మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News