Saturday, December 21, 2024

డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. నీట్ స్టూడెంట్ మృతి

- Advertisement -
- Advertisement -

ములుగు : విహారానికి వెళ్లి తిరిగి వస్తుండగా తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వరంగల్ నీట్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన ములుగు మండలం జంగాలపల్లి క్రాస్ రోడ్డు జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ నీట్‌లో చదువుతున్న వైజాక్‌కు చెందిన విద్యార్థులు నిస్సీ (22), శ్రేయ, హైద్రాబాద్‌కు చెందిన సాయి, సుజిత్, ముర్తుజా, ఉమర్‌లు బుధవారం గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సును చూసేందుకు కారులో వచ్చారు. స్నేహితులందరూ సరస్సు అందాలను వీక్షించి తిరిగి గురువారం తెల్లవారుజామున వరంగల్‌కు బయలుదేరారు.

4 గంటల ప్రాంతంలో జంగాలపల్లి వద్దకు రాగానే డివైడర్‌ను కారు ఢీకొట్టి పల్టీలు కొట్టి పక్కనే ఆగి ఉన్న లారీని తాకి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నిస్సీ అక్కడికక్కడే మృతిచెందగా, శ్రేయ, సుజిత్, సాయి, ముర్తూజా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒక్కరికి స్వల్న గాయాలు కాగా మిగిలిన నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులకు ములుగు జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజిఎంకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News