Wednesday, January 22, 2025

తెలుగు వారికి ర్యాంకుల పంట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశంలో వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యుజి 2023 ఫలితాలలో ఇద్దరు విద్యార్థులు తొలి ర్యాంక్ సాధించారు. తమిళనాడుకు చెందిన ప్రబంజన్ జే, ఆంధ్రప్రదేశ్ విద్యార్థి బొరా వరుణ్ చక్రవర్తి 99.99 పర్సంటైల్ స్కోర్‌తో మొదటి ర్యాంకు వచ్చింది. 720కి 720 మార్కులు సాధించిన మార్కులు వచ్చిన ఇద్దరికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) ఒకే ర్యాంకు ప్రకటించింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న నీట్ యుజి 2023 ఫలితాలు మంగళవారం రాత్రి విడుదలయ్యాయి. తెలంగాణలో కాంచనీ గేయంత్ రఘురామ్ రెడ్డికి అఖిల భారత స్థాయిలో 15వ ర్యాంక్, జాగృతి బొడెద్దులుకు 49వ ర్యాంక్ లభించింది. తెలంగాణలో 42,654 మంది విద్యార్థులు అర్హత సాధించారు.

ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఎపి విద్యార్థి బొరా వరుణ్ చక్రవర్తి.. ఒబిసి కేటగిరీలోనూ ఫస్ట్ ర్యాంక్ పొందారు. ఇడబ్లూఎస్ కేటగిరీలోనూ ఎపి విద్యార్థి ప్రవధాన్ రెడ్డి తొలి ర్యాంక్ సాధించారు. ఎస్‌సి కేటగిరీలో కె.యశశ్రీ రెండో ర్యాంకు పొందారు. కాగా, ఎపిలో 42,836 మంది విద్యార్థులు అర్హత పొందారు. మొత్తం 20.38 లక్షల మంది విద్యార్థులు నీట్ యుజి పరీక్ష రాయగా,అందులో 11.45,968 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఉత్తరప్రదేశ్ విద్యార్థులు అత్యధికంగా 1.39 లక్షల మంది అర్హత సాధించగా, తర్వాతీ జాబితాలో మహారాష్ట్ర 1.31 లక్షలు, రాజస్థాన్ లక్ష దాటారు. దేశంలోనే అత్యంత జనాభా గల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర కాగా, రాజస్థాన్ కూడా టాప్-10లో నిలిచింది. గత నెల ఏడో తేదీన విదేశాల్లో 14 నగరాలతోపాటు దేశీయంగా

499 నగరాల్లోని 4,097 కేంద్రాల్లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్- యుజి) పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. ఏడుగురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని ఎన్‌టిఎ అధికారులు తెలిపారు.
అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ భాషల్లో నీట్-యుజి పరీక్ష నిర్వహించారు. భారత్ ఆవతల అబుదాబ, బ్యాంకాక్, కొలంబో, దోహ, ఖాట్మండు, కౌలాలంపూర్, లాగోస్, మనామా, మస్కట్, రియా, షార్జా, సింగపూర్, దుబాయ్, కువైట్ సిటీల్లో నీట్ పరీక్ష నిర్వహించారు. విద్యార్థులకు వచ్చిన మార్కులను బట్టి వారికి ఎన్‌టిఎ, ఆలిండియా ఇండియా ర్యాంకులు ప్రకటిస్తుంది. ఎంబిబిఎస్, బిడిఎస్ తదితర వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నీట్ మెరిట్ ప్రాతిపదికన యూనివర్సిటీలు సీట్లు కేటాయిస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News