Tuesday, January 21, 2025

నీట్ లీకేజీ వెనుక సాల్వర్ గ్యాంగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ/రాంచి: నీట్ యుజి 2024 ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ప్రధాన కుట్రదారుడు రవి అ త్రిని ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ప్రత్యేక టాస్క్ ఫో ర్స్(ఎస్‌టిఎఫ్) అరెస్టు చేసింది. గ్రేటర్ నోయిడాలోని నీంకా గ్రామంలో రవి అత్రిని ఎస్‌టిఎఫ్ సి బ్బంది అరెస్టు చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి రవి అత్రి అమలుచేస్తున్న వ్యూహం తో దేశంలోనే అత్యున్నత వైద్య ప్రవేశ పరీక్షగా పరిగణించే నీట్ నిజాయితీపైనే నీలినీడలు క మ్ముకుంటున్నాయి. గతంలో దేశంలోని వివిధ రాష్ట్రాలలో ప్రశ్నాపత్రాల లీకేజీలకు పాల్పడిన ర వి అత్రి జవాబులు నింపిన ప్రశ్నాపత్రాలను సో షల్ మీడియా వేదికలను ఉపయోగించి సాల్వర్ గ్యాంగ్ అనే తన నెట్‌వర్క్ ద్వారా అప్‌లోడ్ చే స్తుంటాడు. మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ పేపర్లను లీక్ చేసినందుకు 2012లో ఢిల్లీ పోలీసులకు చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రవి అత్రిని అ రెస్టు చేశారు. నీట్ యుజి 2024ప్రశ్నాపత్రం లీ కేజీకి సంబంధించి బీహార్ పోలీసులు అరెస్టు చే సిన నిందితులలో కొందరు పోలీసుల ఇంటరాగేషన్‌లో రవి అత్రి పేరు బయటపెట్టినట్లు తెలుస్తోంది.

2007లో మెడికల్ ఎంట్రెన్స్ పరీక్ష కో సం కోచింగ్ తీసుకునేందుకు రాజస్థాన్‌లోని కోటాకు రవి వెళ్లాడు. 2022లో పరీక్ష పాసై పిజిఐ రోహతక్‌లో ఎంబిబిఎస్ సీటు సంపాదించాడు. అయితే నాలుగవ సంవత్సరం పరీక్షకు హాజరు కాలేదు. అప్పటికే అతనికి ఎగ్జామ్ మాఫియాతో సంబంధాలు ఏర్పడ్డాయి. వేరే అభ్యర్థులకు బదులుగా రవి పరీక్షకు వెళ్లేవాడు. లీకైన పేపర్లను వి ద్యార్థులకు అందచేయడంలో చాలా కీలకమైన పాత్రను రవి పోషించేవాడు. ఇదిలా ఉండగా.. నీట్ యుజి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మరో ఐదుగురు వ్యక్తులను బీహార్ పోలీసుకు చెందిన ఆర్థిక నేరాల విభాగం అధికారులు శుక్రవారం జార్ఖండ్‌లో అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 18కి పెరిగింది. తాజా అరెస్టులు జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో జరిగినట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. నిందితులు ఐదుగురిని ప్రశ్నించేందుకు పాట్నాకు తరలించినట్లు ఆ అధికారి తెలిపారు. ఇదివరకు రాంచిలో అవదేష్ కుమార్, ఆయన కుమారుడు, నీట్ అభ్యర్థి అభిషేక్‌ను అరెస్టు చేశారు. నీట్ ప్రశ్నాపత్రం కోసం ఈ కేసులో ప్రధాన సూత్రధారి సికందర్ యాదవేందుకు రూ. 40 లక్షలు చెల్లించినట్లు అవదేష్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు.

జార్ఖండ్‌లోని నిర్మాణ పరిశ్రమలో పనిచేయడం ద్వారా సికందర్‌కు, అవదేష్‌కు పరిచయాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకప్పుడు కాంట్రాక్టర్‌గా పనిచేసి ప్రస్తుతం బీహార్‌లోని దానాపూర్ మున్సిపల్ కౌన్సిల్‌లో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సికందర్ జార్ఖండ్‌లో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. రాంచిలో సికందర్ కుమారుడికి ఇన్ఫినిటీ పేరిట ఒక పెద్ద స్పోర్ట్ స్టోర్ ఉండడంతోపాటు నగరంలోని బరియాతు ప్రాంతంలో ఒక విశాలమైన బంగళా ఉంది. సికందర్‌పై ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఒక కేసును నమోదు చేసేందుకు ఆర్థిక నేరాల విభాగం సన్నాహాలు చేస్తోంది. నలుగురు నీట్ యుజి అభ్యర్థులతోపాటు వారి కుటుంబ సభ్యులతోసహా మొత్తం 13 మందిని ఇదివరకే బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో అనురాగ్ యాదవ్, సికందర్ యాదవేందు, నితీష్ కుమార్, అమిత్ ఆనంద్ ఉన్నారు. పరీక్ష తేదీకి ఒకరోజు ముందుగానే మే 4వ తేదీన తమకు నీట్ ప్రశ్నాపత్రం అందిందని లీకైన పేపర్లు పొందిన అభ్యర్తులు వెల్లడించారు.

నీట్ అక్రమాలకు పాల్పడిన నలుగురు నేరస్థులు ఒక సురక్షిత ప్రదేశానికి ఎస్‌యువిలో వెళుతున్నట్లు పాట్నా పోలీసులకు ముందుగా అందిన సమాచారమే ఈ అరెస్టులకు దారితీసింది. ఆ ప్రదేశానికి వెళ్లిన పోలీసులకు రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు చెల్లించి నీట్ ప్రశ్నాపత్రం, జవాబులు పొందిన అభ్యర్థులు పట్టుబడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News