- Advertisement -
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యుజి 2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఇటీవల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) నీట్ యుజి పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించింది. వాటిని పరిగణనలోకి తీసుకున్న ఎన్‌టిఎ మంగళవారం తుది సమాధానాల కీ తో పాటు ఫలితాలను విడుదల చేసింది. నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, మే 5వ తేదీన దేశవ్యాప్తంగా 571 కేంద్రాలలో పరీక్ష జరిగింది. ఎంబిబిఎస్, బిడిఎస్, బిఎస్‌ఎంఎస్, బియుఎంఎస్, బిహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
- Advertisement -