Wednesday, January 22, 2025

నీట్ యూజీ దరఖాస్తు గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యుజి 2024 దరఖాస్తు గడువును ఈ నెల 16వ తేదీ వరకు పొడిగించారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శనివారం(మార్చి 9)తో దరఖాస్తు గడువు ముగియగా, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) తెలిపింది.

మే 5వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ యుజి పరీక్షను నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఎన్‌టిఎ ప్రకటించింది. ఎంబిబిఎస్, బిడిఎస్, బిఎస్‌ఎంఎస్, బియుఎంఎస్, బిహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతోపాటు మొత్తం 13 భాషల్లో నీట్ యుజి పరీక్షను పెన్, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News