Monday, December 23, 2024

జులై నెలాఖరులో నీట్ యుజి కౌన్సిలింగ్?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నీట్ యుజి-2024 కౌన్సిలింగ్ ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు శనివారం వెల్లడించాయి. జులై మొదటి వారంలో నీట్ యుజి కౌన్సిలింగ్ జరగవలసి ఉన్నప్పటికీ తేదీని కాని షెడ్యూల్‌ను కాని కౌన్సింగ్ అధికారులు ప్రకటించలేదు. కొన్ని వైద్య కళాశాలలకు అనుమతి లేఖలు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందని, అదనంగా కొన్ని సీట్లను కేటాయించే అవకాశం కూడా ఉందని వర్గాలు తెలిపాయి. కొత్త కళాశాలలకు కేటాయించే సీట్లలో కూడా మొదటి విడతలోనే కౌన్సిలింగ్ ప్రక్రియను చేపట్టేందుకు వీలుగా ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత కౌన్సిలింగ్ తేదీని ప్రకటించనున్నట్లు వారు చెప్పారు.

ఈ నెలాఖరులో కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వారు చెప్పారు. మే 5న జరిగిన నీట్ యుజి పరీక్షలో అక్రమాలు జరిగాయని, ప్రశ్నాపత్రం లీకేజీ జరిగిందని ఆరోపణలు రావడంతో కొందరు విద్యార్థులకు కలిపిన గ్రేస్ మార్కులను రద్దు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆ అభ్యర్థులకు హల్లీ పరీక్షను నిర్వహించింది. నీట్ యుజి పరీక్షను రద్దు చేయాలని అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలైన నేపథ్యంలో నీట్ పరీక్షను రద్దు చేయడం వల్ల నిజాయితీ పరీక్ష రాసి ర్యాంకులు సంపాదించుకున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని, అలా చేయడం హేతుబద్ధం కాదని ఎన్‌టిఎ, కేంద్రం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియచేశాయి. విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లపై జులై 8న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్నది. కాగా, నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు గతంలోనే నిరాకరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News