Thursday, January 23, 2025

నీట్ యుజి తుది ఫలితాలు వెల్లడి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వివాదంలో కూరుకుపోయిన నీట్ యుజి వైద్య ప్రవేశ పరీక్ష అంతిమ ఫలితాలను జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టిఎ) శుక్రవారం ప్రకటించినట్లు అధికారులు తెలియజేశారు. ఒక ఫిజిక్స్ ప్రశ్నకు మార్కులను పరిగణనలోకి తీసుకున్న తరువాత సుప్రీం కోర్టు నుంచి ఆదేశాన్ని అనుసరించి ఫలితాలను ఎన్‌టిఎ ప్రకటించింది. సదరు ప్రశ్నకు సరైన సమాధానాలు రెండు ఉన్నాయని ఎన్‌టిఎ అప్పట్లో తెలిపింది.

‘తిరిగి సవరించిన స్కోర్ కార్డులు ఇప్పుడు లైవ్‌లో ఉన్నాయి’ అని ఎన్‌టిఎ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇంతకుముందు టాపర్లుగా ప్రకటించిన 67 మంది అభ్యర్థుల్లో 44 మంది సదరు ఫిజిక్స్ ప్రశ్నకు ఇచ్చిన మార్కుల కారణంగా పూర్తి మార్కులు లభించాయి. కొన్ని పరీక్ష కేంద్రాల్లో సమయం నష్టాన్ని భర్తీ చేసేందుకు ఆరుగురు అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను ఎన్‌టిఎ ఉపసంహరించడంతో టాపర్ల సంఖ్య 61కి తగ్గింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News