Friday, November 22, 2024

1,563 మంది అభ్యర్థులకు ఆదివారం నీట్ రీటెస్ట్

- Advertisement -
- Advertisement -

నీట్ యుజి రీటెస్ట్(మరోసారి పరీక్ష) ఆదివారం(జూన్ 23) జరగనున్నది. 1563 మంది అభ్యర్థుల కోసం జరిగే ఈ పరీక్ష జరిగే పరీక్షా కేంద్రాలలో కేంద్ర విద్యా శాఖ అధికారులు కూడా హాజరవుతారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. మేఘాలయ, హర్యానా, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, చండీగఢ్‌లోని ఆరు కేంద్రాలలో పరీక్ష ఆలస్యంగా ప్రారంభం కావడంతో నష్టపోయిన సమయానికి పరిహారంగా ఎన్‌టిఎ గ్రేస్ మార్కులను కలిపింది. గ్రేస్ మార్కుల కారణంగా ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రాగా మరో 61 మంది టాప్ ర్యాంకులు సాధించారు.

దీనిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడం, వివాదం సుప్రీంకోర్టుకు చేరుకోవడంతో గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది అభ్యర్థులకు వాటిని రద్దు చేసి మళ్లీ వారికి పరీక్షను నిర్వహించాలని ఎన్‌టిఎ నిర్ణయించింది. ఆదివారం ఆరు కొత్త కేంద్రాలలో, ఒక పాత కేంద్రంలో పరీక్ష జరగనున్నది. చండీగఢ్‌లో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పరీక్ష రాస్తుండడంతో వారికి పాత కేంద్రంలోనే పరీక్ష రాస్తారు. మిగిలిన ఆరు కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News