Monday, December 23, 2024

నీట్ యుజి సవరించిన ర్యాంకుల జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యుజికి చెందిన సవరించిన ర్యాంకుల జాబితాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) సోమవారం ప్రకటించింది. మే 5వ తేదీన జరిగిన నీట్ యుజి పరీక్షకు సంబంధించి ఆరు పరీక్షా కేంద్రాలలో పరీక్ష ఆల్యంగా ప్రారంభం కావడంతో సమయాన్ని కోల్పోయిన అభ్యర్థులకు పరిహారంగా కొన్ని గ్రేస్ మార్కులను కలిపిన ఎన్‌టిఎ తరువాత వాటిని రద్దు చేసింది. ఆ అభ్యర్థులకు తిరిగి పరీక్ష నిర్వహించిన అనంతరం సవరించిన ర్యాంకుల జాబితాను ఎన్‌టిఎ ప్రటించినట్లు అధికారులు సోమవారం తెలిపారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూన్ 23న ఏడు కేంద్రాలలో మరోసారి పరీక్షను ఎన్‌టిఎ నిర్వహించింది. మొత్తం 1,563 మంది అభ్యర్థులలో కేవలం 48 శాతం మంది మాత్రమే రెండోసారి పరీక్షకు హాజరయ్యారు. 1,563 మంది అభ్యర్థులలో 813 మంది పరీక్షకు హాజరయ్యారని, మిగిలిన అభ్యర్థులు గ్రేస్ మార్కులు లేకుండా తమకు మొదట వచ్చిన ర్యాంకులనే కోరుకున్నారని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News