Wednesday, January 22, 2025

ఆన్‌లైన్‌లో నీట్ యుజి?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహిం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) పరీక్షకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ఆఫ్‌లైన్ విధానం లో నిర్వహించిన యుజిసి నెట్ పరీక్షను కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఆన్‌లైన్ విధానంలో యుజిసి నెట్ నిర్వహించనున్నట్లు షెడ్యూల్‌ను కూడా ఎన్‌టిఎ ప్రకటించింది. నీట్ యుజి పరీక్షకు సంబంధించిన పేపర్ లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కొత్త ఆలోచన చేస్తున్నది. నీట్ పరీక్షను పెన్, పేపర్ పద్ధతిలో ఆఫ్‌లైన్‌లో కాకుండా జెఇఇ తరహాలో ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ప్రస్తుతం నీట్ పరీక్ష పెన్, పేపర్ విధానంలో జరుగుతున్నది. ఈ విధానంలో అభ్యర్థులు ఒఎంఆర్ షీట్‌లో తమ సమాధానాలను బబుల్ చేయాల్సి ఉంటుంది. అయితే నీట్‌లో అక్రమాలను అరికట్టేందుకు ఇకపై ఆన్‌లైన్ విధానమే సరైనదని కేంద్రం యోచిస్తున్నట్లు తెలిసింది.

కొవిడ్ సమయంలోనే ప్రతిపాదనలు
నీట్ యుజి పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని కొవిడ్ సమయంలోనే కేంద్రం పరిశీలించింది. జెఇఇ మెయిన్ తరహాలోనే నీట్ పరీక్షను కూడా ఒకటి కంటే ఎక్కువ సార్లు నిర్వహించాలని విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. విద్యార్థులు ఆన్‌లైన్‌లో నిర్వహిస్తే బాగుంటుందని భావిస్తే, ఆ అంశా తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని అప్పటి కేంద్ర మంత్రి వెల్లడించారు. అయితే తాజాగా నీట్ యుజి పరీక్ష ప్రశ్నపత్రం లీకేజి, గ్రేస్ మార్కుల వివాదంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న ప్రస్తుత సమయంలో నీట్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించే అంశాన్ని సర్కార్ సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఏటా జెఇఇ మెయిన్ పరీక్షలకు సుమారు 10 లక్షల మంది వి ద్యార్థులు హాజరవుతుండగా, ఈ ఏడాది నీట్ పరీక్షకు దేశవ్యాప్తంగా 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నా రు.

అయితే ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు నీట్ యుజి పరీక్షకు హాజరవుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహణ సాధ్యాసాధ్యాలను కేంద్రం సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జెఇఇ తరహాలో సెషన్ల వారీగా కొన్ని రోజుల పాటు ని ర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే జెఇఇ మె యిన్ పరీక్షలు సుమారు ఏడు రోజుల నుంచి పది రోజుల పా టు జరుగుతుండగా, నీట్ యుజి పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహి స్తే సుమారు 20 నుంచి 25 రోజుల పాటు నిర్వహించే అవకా శం ఉన్నది. నీట్ యుజి పరీక్ష ద్వారా ఎంబిబిఎస్, బిడిఎస్, బిఎస్‌ఎంఎస్, బియుఎంఎస్, బిహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News