Tuesday, November 5, 2024

నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు సాధిస్తాం : స్టాలిన్

- Advertisement -
- Advertisement -

చెన్నై : తమిళనాడు లోని వైద్య విద్య కనీస సౌకర్యాలను విచ్ఛిన్నం చేసేలా “నీట్ ”ను బలవంతంగా విధిస్తున్నారని, కానీ ప్రజా పోరాటాలతో రాష్ట్రం తనకు తాను దీని నుంచి మినహాయింపు పొందుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదివారం స్పష్టం చేశారు. డాక్టర్స్ అసోసియేషన్ ఫర్ ఈక్వాలిటీ (డీఏఎస్‌ఈ) నాలుగో రాష్ట్ర స్థాయి సదస్సు సందర్భంగా వర్చువల్‌గా ఆయన మాట్లాడారు. నీట్ ( నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ ) ఫలితంగా రాష్ట్రంలో అనేక మంది వైద్య విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. నీట్ మినహాయింపు కోరుతూ న్యాయపోరాటం ప్రారంభించామని, ఇది నిర్లక్షం అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని,

మరి కొందరు అధికారులు ఇది అసాధ్యమంటున్నారని, కానీ దీన్ని మినహాయించడమే తమ లక్షమని, ప్రజల మద్దతుతో ఇది జరుగుతుందని స్టాలిన్ వివరించారు. నీట్ వ్యతిరేక సంతకాల ఉద్యమం డిఎంకె యువజన విభాగం, విద్యార్థి విభాగం, వైద్య విభాగం ప్రారంభించాయి. ఇది ప్రజా ఉద్యమంగా మారుతుంది. ఈ పరీక్ష సామాజిక న్యాయానికి వ్యతిరేకమని ఆందోళన చేస్తున్నాయి. గత డిఎంకె ప్రభుత్వాల హయాంలో విస్తృతమైన ఆరోగ్య, వైద్య సౌకర్యాలను తమిళనాడులో కల్పించే కీర్తి మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి దక్కుతుందని స్టాలిన్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News