Monday, December 23, 2024

నీతోనే నేను టైటిల్ పోస్ట‌ర్ లాంచ్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినిమా బండి’ ఫేమ్ వికాష్ వ‌శిష్ట హీరోగా మోక్ష‌, కుషిత క‌ళ్ల‌పు హీరోయిన్లుగా శ్రీమామిడి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అంజిరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్‌.సుధాక‌ర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘నీతోనే నేను’. ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను చిత్ర నిర్మాత ఎమ్ సుధాకర్ రెడ్డి బర్త్ డే సందర్భంగా హైద‌రాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఘనంగా ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర నిర్మాత ఎమ్.సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘చదువుకునే టైంలోనే సినిమా తీయాలనే కల ఉండేది. నాకు మంచి టీం దొరకడంతోనే ఇలా మీ ముందుకు రాగలిగాను. నా తమ్ముడు ప్రభాకర్ రెడ్డి, నా స్నేహితుడు నవీన్ కుమార్‌లకు థాంక్స్. అంజిరామ్‌ గారితో నాగరాజు గారు ఇది వరకు పని చేశారు. ఆయన వల్లే ప్రాజెక్ట్ కుదిరింది.

సినిమాకు పని చేసిన హీరో వికాస్, హీరోయిన్లు మోక్ష, కుషి అందరికీ థాంక్స్. నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేశాను. రామ్ అనే పాత్ర కూడా గవర్నమెంట్ టీచర్. అందులోని లోపాలను సరిదిద్దేక్రమంలో జరిగే కథే నీతోనే నేను. ఈ పాత్రకు హీరో వంద శాతం న్యాయం చేశారు. సినిమా బండి చిత్రంలో ఆయన నటన చూసి ఈ కారెక్టర్‌కు సెట్ అవుతారని అనిపించింది. ఎంతో సహజంగా నటించారు. సీత పాత్రలో మోక్ష చక్కగా నటించారు. ఆయేష కారెక్టర్‌కు కుషిగారు న్యాయం చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను రిలీజ్ చేస్తాం. కార్తీక్ గారి సంగీతం అద్భుతంగా ఉంటుంది. మా సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News