Wednesday, January 22, 2025

తొమ్మిదేళ్లలో దక్షిణమధ్య రైల్వేకు రూ.19,901 కోట్ల కేటాయింపులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  కొత్త సింగిల్, డబుల్ లైన్‌ల మంజూరులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందని, దక్షిణమధ్య రైల్వేకు కొత్త రైళ్లు కేటాయించలేదని వస్తున్న కథనాలు తప్పని దక్షిణమధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. దక్షిణమధ్య రైల్వేకు అధిక రాబడి వాటా ఉన్నప్పటికీ ఈ జోన్ వెనుకబడి ఉందన్న వస్తున్న కథనాలు తప్పుడు ఆరోపణలని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో గడిచిన 9 ఏళ్లలో కేవలం 100 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ మాత్రమే వేశారని పేర్కొనడం తప్పని, వాస్తవానికి 9 సంవత్సరాల్లో తెలంగాణలో 335 కి.మీ కొత్త రైల్వే లైన్లను ప్రారంభించామని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.

దీంతోపాటు అదనంగా, 239 కి.మీ.ల పొడవు ఉన్న ట్రాక్‌లు బహుళ లైన్‌లుగా (డబుల్ లైన్, ట్రిపుల్ లైన్లుగా, క్వాడ్రపుల్ సెక్షన్‌లు)గా మార్చబడ్డాయని వారు పేర్కొన్నారు. దీంతోపాటు రాష్ట్రం నుండి 9 జతల ఆరిజినేటింగ్ రైళ్లు, 11 జతల రైళ్లను ప్రారంభించినట్టు వారు తెలిపారు. 9 ఏళ్లలో రాష్ట్రానికి బడ్జెట్‌లో కేటాయింపులు గణనీయంగా పెరిగాయని, 2023, -24 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ గ్రాంట్ రూ. 4,418 కోట్లు ఉందని, ఇది 2014-,15 బడ్జెట్ గ్రాంట్‌తో పోలిస్తే 17 రెట్లు ఎక్కు వని, గడిచిన తొమ్మిదేళ్లలో మొత్తం బడ్జెట్ కేటాయింపులు రూ.19,901 కోట్లు అని వారు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News