Sunday, December 22, 2024

వైద్యుల నిర్లక్ష్యం.. బాలింత మృతి

- Advertisement -
- Advertisement -

బజార్హత్నూర్ ః వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే .. మృతిరాలి భర్త గౌతమ్ , గ్రామ సర్పంచ్ రుక్మబాయి తెలిపిన వివరాల ప్రకారం … రాత్రి రెండు గంటల సమయంలో 9 నెలల గర్బిణి రమాకు పురిటి నొప్పులు రావడంతో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబ సభ్యులు ఉదయం మూడు గంటల సమయంలో తీసుకెళ్లారు. ఆసుపత్రిలో నర్సు ఉండడంతో తీవ్ర నొప్పులతో ఉన్న గర్బిణిని అడ్మిట్ చేశారు. ఉదయం ఐదు గంటలకు సాధారణ ప్రసవంతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

నార్మల్ డెలవరీ కావడంతో రక్తస్త్రాతం ఎక్కువగా అవుతుంది. వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తీసుకపోమని ఎఎన్‌ఎం తెలిపినట్లు వివరించారు. వెంటనే 108 వాహనాన్ని పిలిపించి రిమ్స్ ఆసుపత్రికి వెళ్లే మార్గ మధ్యంలో బాలింత మృతి చెందినట్లు తెలిపారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడం ఆసుపత్రి సిబ్బంది నిర్లక్షం వలనే తన భార్య చనిపోయిందని మృతిరాలి భర్త తెలిపారు. మృతురాలికి పుట్టిన బిడ్డతో ముగ్గురు పాపలు, ఒక బాబు ఉన్నట్లు సర్పంచ్ తెలిపారు. నిర్లక్షంగా వ్యవహరించిన ఆసుపత్రి సిబ్బంది పై చర్యలు తీసుకొని మృతురాలి కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలని గ్రామస్తులు కొరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News