Wednesday, January 22, 2025

వైద్యుల నిర్లక్ష్యంతో బాలింతలు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా శుక్రవారం ఇద్దరు బాలింతలు మృతి చెందారు. బాలింతలు అనారోగ్యంతో మలక్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా అక్కడ ఆసుపత్రి సిబ్బంది బాలింతలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలింతలు మృతి చెందారు.

మలక్ పేట వైద్యుల నిర్లక్ష్యం వలనే బాలింతలు మృతి చెందారని మృతువుల బంధువులు ఆరోపించారు. బాలింతల కుటుంబ సభ్యులు , బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. చాదర్ ఘాట్ పోలీసులకు బాలింత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News