Wednesday, January 22, 2025

హెచ్‌ఎండిఏ అధికారుల నిర్లక్ష్యం… సైకిల్‌ ట్రాక్‌పై గేదెల సంచారం

- Advertisement -
- Advertisement -

సైకిల్ ట్రాకా?…గేదెల ట్రాకా?

మనతెలంగాణ/హైదరాబాద్:  అంతర్జాతీయ ప్రమాణాలతో ఓఆర్‌ఆర్‌ను ఆనుకొని నిర్మించిన సైకిల్‌ట్రాక్‌పై గేదెలు నడపడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం క్రితం మంత్రి కెటిఆర్ ప్రారంభించిన ఈ సైకిల్‌ట్రాక్‌ను గేదెల ఫ్యాషన్ కోసం మార్చడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.100 కోట్లతో నిర్మించిన ఈ సైకిల్ ట్రాక్‌పై సైకిల్‌దారులు తప్ప వేరే వాళ్లు రాకుండా చర్యలు తీసుకోవాల్సిన హెచ్‌ఎండిఏ అధికారులు పట్టించుకోకపోవడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

ఈ ట్రాక్ ప్రారంభం జరిగి వారం కూడా దాటక ముందే గేదెలు తిరగడాన్ని వీడియో తీసిన కొందరు దానిని సోషల్‌మీడియాలో పెట్టడంతో హెచ్‌ఎండిఏ అధికారులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైకిల్ ట్రాక్ పైన 24 గంటలు సిసి టివి మానిటరింగ్ ఉంటుందని అధికారులు చెప్పినా.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఏమిటనీ వారు ప్రశ్నిస్తున్నారు. గేదెల సంచారానికి హెచ్‌ఎండిఏ అధికారుల నిర్లక్ష్యమే కారణమని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News