Monday, December 23, 2024

పోలీసులు, వైద్యాధికారుల నిర్లక్ష్యంతో… 13 రోజులుగా కుళ్లిన శవం

- Advertisement -
- Advertisement -

 

సంగారెడ్డి జిల్లా పోలీసులు, వైద్యాధికారుల నిర్లక్ష్యంతో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో 13 రోజులుగా శవం కుళ్లిపోయి ఉంది. గత నెల 18న సుల్తాన్ పూర్ లో రోడ్డు ప్రమాదంలో చిన్న (28) అనే యువకుడు గాయపడ్డాడు. ప్రమాదంలో గాయపడ్డ ఎర్రోల్ల చిన్నని 108 వాహనానంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది. వైద్యులు చిన్నకు గత నెల 18 నుంచి 22 వరకు సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ఆస్పత్రిలో చికిత్స అందించారు . చికిత్స పొందుతూ డిసెంబర్ 23న ఎర్రోల్ల చిన్నమృతి చెందాడు.

ఎర్రోల్ల చిన్న చనిపోయిన వెంటనే సంగారెడ్డి టౌన్ పుల్కల్ పోలీసులకు ఆసుపత్రి వైద్యులు సమాచారం ఇచ్చారు. అనంతరం మృత దేహాన్ని మార్చురికి తరలించారు. శుక్రవారం మున్సిపల్ సిబ్బందికి అప్పగించే క్రమంలో శవాన్ని మార్చురీ నుంచి బయటికి తీస్తుండగా శ్రీనివాస్ జేబులో నుంచి ఆధార్ కార్డ్ బయటపడింది. ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబీకులకు మున్సిపల్ సిబ్బంది సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకొని ఆసుపత్రి ఎదుట ఆందోలనకు దిగారు.

చిన్న భార్య తన భర్తను పోలీసులే చంపారని ఆరోపించారు. ఆందోళనకు దిగిన వారి పై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. మహిళలను కడుపులో తన్నారని మహిళలు మండిపడ్డారు. సంగారెడ్డి డిఎస్పీతో వాగ్వాదానికి దిగారు. యాక్సిడెంట్ అయినప్పుడు, చనిపోయినప్పుడు ఎందుకు చెప్పలేదని, తనకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమింపజేయనని చిన్న భార్య డిమాండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News