Friday, November 22, 2024

తొమ్మిదోసారీ విఫలం

- Advertisement -
- Advertisement -

Negotiations between leaders of the Center-Farmers' Associations failed

 

తిరిగి 19న భేటీకి సిద్ధం

న్యూఢిల్లీ : కేంద్రం-రైతు సంఘాల నేతల మధ్య చర్చలు మరోసారి విఫలం అయ్యాయి. శుక్రవారం ఇక్కడి విజ్ఞాన భవన్‌లోనే సంప్రదింపులు5 గంటలు సాగాయి. అయితే చట్టాలు వివాదాస్పదంగా ఉన్నందున వీటిని ముందుగా ఉపసంహరించుకుని తీరాలని రైతు సమాఖ్య కేంద్రానికి తేల్చిచెప్పింది. అయితే ముందు వీటిలోని తప్పొప్పును ఎంచాలని కేంద్రం సూచించింది. ఈ దశలోనే ఇంతకు ముందటి లాగానే ఈ 9వ రౌండ్ చర్చలు కూడా ఎటూ పొసగని రీతిలో నిలిచిపొయ్యాయి. అయితే తిరిగి ఈ నెల 19వ తేదీన సమావేశం అయ్యేందుకు ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చాయి.

కొత్త చట్టాల అమలుపై ఇటీవలే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. చర్చల ప్రక్రియతో రాజీకి సూచించింది. ఈ క్రమంలో ఇప్పుడు జరిగిన చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది. రైతులు వారి డిమాండ్ల విషయంలో పట్టువిడుపులు ప్రదర్శించాలని, కొంచెం అయినా దిగిరావాలని కేంద్రం తెలిపింది. అవసరం అయిన సవరణలకు కేంద్రం సిద్ధంగా ఉందని మంత్రులు రైతు నేతలకు తెలిపారు. అయితే చట్టాల రద్దు జరిగితేనే తమకు మేలు జరుగుతుందని రైతులు వారికి స్పష్టం చేశారు.

తాము చట్టాల రద్దును కోరామని అయితే ప్రభుత్వం ఇందుకు సమ్మతించడం లేదని రైతు నేత జోగిందర్ సింగ్ ఉగ్రహన్ తెలిపారు. తిరిగి ఈ నెల 19వ తేదీన కలుసుకోవడానికి నిర్ణయం జరిగిందని చెప్పారు. ఇతర కొన్ని విషయాలు ఇప్పటి చర్చలలో ప్రస్తావనకు వచ్చినట్లు వెల్లడైంది. పంజాబ్‌లోని వాహన రవాణాదార్లపై నియా దాడులను తాము ప్రస్తావించినట్లు వివరించారు. రైతులకు ట్రాన్స్‌పోర్టర్లు మద్దతు ఇస్తున్నారనే సాకుతో వారిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని సింగ్ ఉగ్రహన్ విమర్శించారు. భోజన విరామంతో కలిసి ఇప్పుడు 5 గంటల పాటు సంప్రదింపులు జరిగాయి.

నెలన్నర దాటి ఎటువంటి పరిష్కారం లేకుండా ఉన్న పరిస్థితిని పరిష్కరించాలనే తాము పట్టుదలతో ఉన్నామని, ఇందుకే నేరుగా కేంద్రంతో చర్చలకు వీడకుండా వెళ్లుతున్నామని తెలిపారు. ప్రభుత్వం పట్టువిడుపులకు దిగిందని, రైతు సంఘాలు కూడా ఇదే విధమైన ధోరణిని ప్రదర్శించాలని అప్పుడే సవ్యమైన పరిష్కారం కుదురుతుందని, చర్చల ఆరంభంలో వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ విజ్ఞప్తి చేశారు. ఇటు ప్రభుత్వం అటు తమ పాత వాదనలనే సాగించాయని , ముందుడుగు ఏదీ లేదని ఆలిండియా కిసాన్ సంఘర్ష్ సమన్వయ సమితి సభ్యులు కవిత కురుగంటి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News