Sunday, December 22, 2024

అద్దె బస్సుల యజమానులతో జరిపిన చర్చలు సఫలం

- Advertisement -
- Advertisement -

సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేందుకు కృషి
సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తాం
సంక్రాంతికి ఉచిత బస్సు సర్వీసులతో పాటు ప్రత్యేక బస్సులను నడుపుతాం

మనతెలంగాణ/హైదరాబాద్: అద్దె బస్సుల యజమానులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని టిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్ తెలిపారు. నేడు బస్‌భవన్‌లో అద్దె బస్సుల యజమానులతో సమావేశమైన అనంతరం ఆయన వివరాలు వెల్లడించారు. ఆర్టీసి అద్దె బస్సుల యజమానులతో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. వారు కొన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని ఆయన తెలిపారు. అద్దె బస్సుల యజమానుల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తామన్నారు. నేటి నుంచి సమ్మె లేదని, అద్దె బస్సులు యధావిధిగా నడుస్తాయని ఆయన స్పష్టం చేశారు. సంక్రాంతికి ఉచిత బస్సు సర్వీసులు ఉంటాయని, సంక్రాంతికి ప్రత్యేక బస్సులు కూడా నడుపుతామని సజ్జనార్ పేర్కొన్నారు.

Bus owners strike

Private Bus Owners

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News