Monday, December 23, 2024

లోక్ సభ ఎన్నికల బరిలో రామ్ చరణ్ హీరోయిన్!

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈక్రమంలో పలు పార్టీలు సినీ తారలను ఎన్నికల బరిలో దింపుతున్నాయి. ఇప్పటికే బిజెపి, కాంగ్రెస్ తరుపున పలువురు నటీనటులు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి హీరోయిన్ నేహా శర్మ. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ బ్యూటీ రెడీ అవుతున్నట్లు సమాచారం. నేహా శర్మ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అజిత్ శర్మ కూతురు. ఎన్నికల సమయంలో తన తండ్రి కోసం నేహా గతంలో ప్రచారం కూడా చేసింది.

ప్రస్తుతం బీహార్ లో పార్లమెంట్ ఎన్నికల జరుగనున్న క్రమంలో మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా కొనసాగుతోంది. ఈక్రమంలో అజిత్ శర్మ..తన కూతురు రాజకీయ ఎంట్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. భాగల్‌పూర్ నుంచి తన కూతురు నేహా శర్మను పోటీ చేయించాలనుకుంటున్నామని అజిత్ శర్మ తెలిపారు. పోటీ చేసేందుకు పార్టీ అనుమతిస్తే ఇక్కడి నుంచే నేహా శర్మ ఎన్నికల బరిలో దిగుతుందని ఆయన చెప్పారు. మరి, కాంగ్రెస్ తరుపున నేహా ఎన్నికల్లో పోటీ చేస్తుందా లేదా చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News