Wednesday, January 22, 2025

ఫ్రెష్ కామెడీ కథలో ఉంటుంది

- Advertisement -
- Advertisement -

అన్ని వర్గాల ప్రేక్షకులను ‘డిజె టిల్లు’ సినిమా ఆకట్టుకుంటుందని చెబుతోంది యంగ్ హీరో నేహా శెట్టి. ఆమె రాధిక పాత్రలో నటించిన ఈ సినిమా ఈనెల 12న థియేటర్‌లలో విడుదలకు సిద్ధమవుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు కలసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. మీడియా సమావేశంలో ఈ సినిమా గురించి నేహా శెట్టి మాట్లాడుతూ “ఈ సినిమా ట్రైలర్ చూసి రొమాంటిక్ ఫిల్మ్ అనుకుంటారు. కానీ ఈ సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిసిన ఒక ప్యాకేజ్ లాంటిది. ఇందులో కామెడీ, థ్రిల్, ఎంటర్‌టైన్‌మెంట్, రొమాన్స్ అన్నీ ఉన్నాయి.

ఈ సినిమాలో రాధిక పాత్రలో నటించాను. రాధిక ఈతరం అమ్మాయి. నిజాయితీగా, ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. తను కరెక్ట్ అనుకున్న పనిని చేసేస్తుంది. ఇలాంటి పాత్రను నేను సినిమాల్లో ఇప్పటిదాకా చూడలేదు. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న పాత్ర ఇది. ఇక తెలంగాణ యాసలో కామెడీ చేస్తున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. చాలా ఫ్రెష్ కామెడీ కథలో ఉంటుంది. సిద్ధు టాలెంటెట్ యాక్టర్. ఇక పాండమిక్ వల్ల మనమంతా ఒత్తిడికి గురయ్యా, బాధపడ్డాం. ఆ ఒత్తిడినంతా ‘డిజె టిల్లు’ చూస్తే నవ్వుతూ మర్చిపోతారని చెప్పగలను”అని అన్నారు.

Neha Shetty interview on DJ Tillu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News