Friday, December 20, 2024

అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో మహిళలకు గర్భం..ప్రసవం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః గర్భస్రావం జరిగి, తీవ్రంగా రక్తస్రావమై, షాక్ పరిస్థితిలో వచ్చిన వెంటనే చికిత్స చేయడంతో పాటు నాలుగేళ్ల తర్వాత మళ్లీ ఆమె గర్భం దాల్చేలా చేసి పండంటి బిడ్డతో ఇంటికి పంపారు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు. నేహా పోనాల్ అనే 33 ఏళ్ల మహిళ విషయంలో ఎంతటి సంక్లిష్ట పరిస్థితులు తలెత్తాయో, వాటిని తాము ఎలా అధిగమించి ఆమెకు చికిత్స చేసి మరోసారి గర్భం దాల్చేలా చేసినట్లు గైనకాలజిస్టు, ఆబ్బెట్రీషియన్ డాక్టర్ వసుంధర చీపురుపల్లి తెలిపారు. సుమారు నాలుగేళ్ల క్రితం నేహా సోనాల్ గర్భస్రావం అనంతర సమస్యలతో ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే ఆమెకు అండీసీ చేయడంతో బాగా తీవ్రంగా రక్తస్రావం అవుతోంది, షాక్‌కు గురయ్యారు. వెంటనే ఇక్కడ చేర్చుకుని ముందుగా రక్తస్రావాన్ని ఆపాలంటే అందుకు కారణం ఏంటోనని చూశాం.

ఆమెకు గర్భసంచికి రక్తసరఫరా చేసే రక్తనాళాలు, సరాల్లో సమస్య ఉందని గుర్తించినట్లు చెప్పారు. దాంతో ముందుగా ఆమెకు కిమ్స్ ఆస్పత్రికి చెందిన ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టు డాక్టర్ రూపేష్ బృందం ఆధ్వర్యంలో గర్భసంచికి వెళ్లే ప్రధాన రక్తనాళాన్ని మూసేసేందుకు ఎంబొలైజేషన్ అనే ప్రక్రియ చేయించామని, అయితే, ఇది చేయడానికి ముందే ఆమెకు, ఆమె బంధువులకు కౌన్సెలింగ్ చేశామని తెలిపారు. దీంతో భవిష్యత్తులో రుతుక్రమం సరిగా ఉండకపోవచ్చని, గర్భం దాల్చే అవకాశం కూడా లేకపోవచ్చని, గర్భస్రావం అయ్యేందుకూ అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఎంటొలైజేషన్ విజయవంతం కావడంతో ఆమెకు రక్తస్రావం ఆగిపోయింది. దాంతో అప్పుడు ఆమెను డిశ్చార్జి చేసినట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News