Monday, December 23, 2024

దేశానికి తొలి ప్రధాని సుభాష్ ..నెహ్రూ కాదు:బిజెపి ఎంఎల్ఎ బసన్‌గౌడ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : నెహ్రూ దేశ తొలి ప్రధాని అని అందరికీ తెలుసు. అయితే జవహర్‌లాల్ నెహ్రూ దేశానికి మొట్టమొదటి ప్రధాని కాదని , కేంద్ర మాజీ మంత్రి , కర్నాటక బిజెపి ఎమ్మెల్యే బసన్‌గౌడ పాటిల్ యత్నాల్ వ్యాఖ్యానించారు. ఈ మాటలు దుమారానికి దారితీశాయి. ఇటీవల ఆయన ఓ సభలో మాట్లాడారు. దేశ తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని, నిజానికి బోస్ భయంతోనే బ్రిటిష్ పాలకులు భారతదేశం విడిచిపెట్టిపొయ్యారని ఈ ఎమ్మెల్యే తెలిపారు. బ్రిటిష్ పాలకులలో నేతాజీ భయోత్పాతం సృష్టించారని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత దేశ పరిస్థితులు మారాయి. ప్రపంచంలో మారిన పరిస్థితులతో బ్రిటిషర్లు భారత్ వీడివెళ్లారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో ముందుగా స్వాతంత్య్రం ప్రకటించిన తరువాత తొలి ప్రధాని అయింది నేతాజీనే అని పాటిల్ తెలిపారు.

ఈ ప్రాంతాలకు సొంత కరెన్సీ, జెండా, జాతీయ గీతం ఉండేవని చెప్పారు. వీటిని పరిగణనలోకి తీసుకునే ప్రధాని మోడీ తరచూ దేశానికి తొలి ప్రధాని సుభాష్ చంద్ర బోస్ అని, నెహ్రూ కాదని చెపుతూ ఉంటారని, దీనిని తానూ చరిత్ర నేపథ్యంలోనే , వెలుగులోకి రాని పుస్తకాల నేపథ్యంలోనే బలపరుస్తానని వెల్లడించారు. గౌడ పాటిల్ ఇంతకు ముందు కేంద్ర రైల్వే, జవుళి సహాయ మంత్రిగా పనిచేశారు. నిరాహార దీక్షలతో, నిరసనలతో దేశానికి స్వాతంత్య్రం రాలేదని, ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపాలనే అహింసవాదంతో పరాయిల పాలన పోలేదని బాబాసాహేబ్ అంబేద్కర్ ఓ పుస్తకంలో రాశారని తెలిపారు. మన స్వాతంత్రం మనకు నేతాజీ ధైర్యసాహసాలతోనే సిద్ధించిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News