Sunday, December 22, 2024

ఆర్టికల్ 370లో నెహ్రూ బాధ్యత లేదు

- Advertisement -
- Advertisement -

నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత అబ్దుల్లా
నిర్ణయం సమయంలో ఆయన అమెరికాలో
మాజీ ప్రధానిపై విషం చిమ్మడం ఎందుకు?
ఈ దశలో పటేల్, ముఖర్జీ కూడా ఉన్నారు
అధికరణ రద్దుపై సుప్రీం తీర్పు సరికాదు
రాష్ట్ర హోదా ఎప్పటికి కల్పిస్తారు?
అసెంబ్లీ ఎన్నికలపై జాప్యం ఎందుకు?

న్యూఢిల్లీ : కశ్మీర్ సంబంధిత 370 అధికరణం రావడం వెనుక తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ బాధ్యత ఏమీ లేదని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. పార్లమెంట్‌లో మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ విషయంలో చేసిన ప్రకటనను అబ్దుల్లా తిప్పికొట్టారు. కశ్మీర్ కల్లోల కారకులు తొలి ప్రధాని నెహ్రూ అనే వాదన సరికాదని అబ్దుల్లా స్పష్టం చేశారు. సమావేశం తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. నిజానికి ఈ ఆర్టికల్ తెచ్చినప్పుడు నెహ్రూ దేశంలో లేనేలేరని, అప్పుడు ఆయన అమెరికాలో ఉన్నారని , కేబినెట్ సమావేశం జరిగినప్పుడు ఆయన లేరని, నిర్ణయానికి ఆయనను ఏ విధంగా బాధ్యులు చేస్తారని ప్రశ్నించారు.

పైగా నిర్ణయంపై చర్చ దశలో శ్యామ ప్రసాద ముఖర్జీ హాజరయ్యారని అబ్దుల్లా తెలిపారు. ఐరాసకు విషయాన్ని తీసుకువెళ్లడం, అకాల కాల్పుల విరమణ ఇవన్నీ తప్పిదాలే అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నెహ్రూపై విద్వేషవిషం వెదజల్లుతున్నదో అర్థం కావడం లేదన్నారు. ఆయన ఇప్పుడు లేరు. లేని వారిపై బురదచల్లడం సబబు కాదన్నారు. ఆర్టికల్ 370 తీసుకువచ్చినప్పుడు సర్దార్ పటేల్ ఉన్నారని వివరించారు. మరి ఆర్టికల్ గురించి పటేల్ బాధ్యత ఉందనుకోవాలా? అని ప్రశ్నించారు.

ఇక ఆర్టికల్ రద్దు సబబే అని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల అబ్దుల్లా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టికల్ విషయం ఆది నుంచి న్యాయస్థానాల పరిధిలో ఉంటూ వచ్చింది. చూద్దాం ఇకపై ఏం జరుగుతుందో అన్నారు. ఆర్టికల్ ఎత్తివేతతో జమ్మూ కశ్మీర్‌లో నూతన అధ్యాయం, ప్రగతి దిశలో పయనం ఆరంభమైందని చెపుతున్నారు కదా అని విలేకరులు ప్రశ్నించగా, అక్కడికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకుంటే ఏం జరుగుతున్నదో తెలివస్తుందని విలేకరులకు తెలిపారు.

ఎన్నికలకు సెప్టెంబర్ వరకూ సాగదీత అన్యాయం
సుప్రీంకోర్టు తీర్పులో పలు లొసుగులు ఉన్నాయని ఈ అపార అనుభవజ్ఞ నేత అబ్దుల్లా విమర్శించారు. ఆర్టికల్ రద్దు సరైనని తెలిపారు. వెంటనే అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనిని తామంతా కోరుకుంటున్నాం. మరి వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకూ ఎందుకు ఆగడం? ఇందులో ఎటువంటి సహేతుకత లేదని మండిపడ్డారు. ఇక రాష్ట్ర ప్రతిపత్తి గురించి కూడా స్పష్టత లేదు. దీనిపై తరువాత మాట్లాడుతామని ధర్మాసనం తెలిపింది.

ఇక న్యాయం ఎక్కడుందని ప్రశ్నించారు. కేంద్రం కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుకు దిగడం సముచితమే అని, దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఒకే హక్కు ఉంటుందని పేర్కొంటూ సోమవారం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పిఒకె) గురించి కూడా అబ్దుల్లా మాట్లాడారు. ఈ ప్రాంతం భారతదేశానికి చెందుతుందనే కేంద్రం వాదన గురించి స్పందిస్తూ దీనిపై నిర్ణయం తీసుకోవల్సింది ప్రభుత్వం. తాము ఎవరిని ఆపడం లేదని, దీనిపై తామేమీ చేయగలవారమని ఎదురు ప్రశ్న వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News