- Advertisement -
ఛండీగఢ్: పాత పగ నేపథ్యంలో అర్థ రాత్రి సమయంలో గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి భర్త పక్కన పడుకున్న ఆమె నోరు మూసి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన సంఘటన హర్యానా రాష్ట్రం పానిపట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కన్నయ్య అనే వ్యక్తి పక్కింట్లో ఉండే దంపతులతో మూడు నెలల క్రితం గొడవ జరిగింది. దీంతో దంపతులు కన్నయ్య స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దంపతులకు కన్నయ్య పగపెంచుకున్నాడు. అర్థరాత్రి సమయంలో వాళ్ల ఇంట్లోకి వెళ్లి భర్త పక్కనే ఉండగానే భార్య నోరు మూసి బయటకు లాక్కొచ్చాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. అప్పుడే భర్త నిద్ర నుంచి లేచి బయటకు రాగా కన్నయ్య కనిపించాడు. కన్నయ్యను పట్టుకొని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అతడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.
- Advertisement -