Friday, December 20, 2024

సౌండ్ తగ్గించలేదని గర్భిణీపై పక్కింటి వ్యక్తి కాల్పులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లౌడ్ స్పీకర్ల శబ్దం తగ్గించలేదని గర్భిణీపై పక్కింటి వ్యక్తి గన్‌తో కాల్పులు జరిపిన సంఘటన ఢిల్లీలోని సిరాస్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సిరాస్‌పూర్‌లో హరిష్-రంజు అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు జన్మించడంతో కౌన్ పుజాన్ అనే పేరుతో వేడుకలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ దంపతులకు ముగ్గురు సంతానం ఉండగా రంజు నిండు గర్భిణీగా ఉంది. ఇంటిపై డిజె పెట్టుకొని పాటలు వింటున్నారు.

లౌడ్ స్పీకర్ల నుంచి రణగొణ ధ్వని ఎక్కువగా వస్తుండడంతో సౌండ్ తగ్గించామని పక్కింటి వ్యక్తి హరిష్ అడిగాడు. సౌండ్ తగ్గించకపోవడంతో తన స్నేహితుడు అమిత్ దగ్గర ఉన్న గన్ తీసుకొని సదురు మహిళపై కాల్పులు జరిపాడు. వెంటనే మహిళను స్థానికంగా ఉన్న మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెంటనే ఆస్పత్రికి చేరుకొని వివరాలు అడగడానికి ప్రయత్నించారు. కానీ మెడ భాగంలో బుల్లెట్ గాయాలు కావడంతో ఆమె సరిగా స్పందించడంలేదు. బాధితురాలి మరదలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపిసి 307, 34, 27 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హరిష్, అమిత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News