Wednesday, January 22, 2025

భర్త నిద్రపోయాడు… చంపేయండి… ప్రియుడికి మెసేజ్ చేసిన ప్రియురాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: భర్త నిద్రపోయాడు చంపేయాలని ప్రియుడుకు ప్రియురాలు సందేశం పంపి హత్య చేయించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. రామచంద్రాపురం రామాలయం వీధిలో ఎం పెంచల ప్రసాద్(35) అనే వ్యక్తి నివసిస్తున్నాడు. పెంచల ప్రసాద్‌కు ముగ్గురు అక్కలు ఉండడంతో పెద్ద అక్క ప్రసన్న కుమార్తె సుహితను మేనమామ పెళ్లి చేసుకున్నాడు. మేనకోడలు తన మామను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో ఇంట్లో గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ప్రసాద్ స్నేహితుడు వరతో ప్రసన్న పరిచయం పెంచుకుంది. వరతో భార్య పలుమార్లు ఫొన్‌లో మాట్లాడుతుండడంతో ఆమెకు వద్దని వారించాడు.

ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో భర్త ఇంట్లో పడుకొని ఉండగా అతడికి సందేశాన్ని పంపింది. తన భర్త ఇంట్లో నిద్రపోయాడని చంపి వేయాలని సూచించింది. రాత్రి పది గంటల సమయంలో వర తన ఐదుగురు స్నేహితులతో కలిసి అక్కడికి వచ్చి అత్యంత పాశవికంగా భర్తను హత్యచేయించింది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తన నోట్లో గుడ్డలు కుక్కి తన భర్తను చంపేశారని వివరణ ఇచ్చింది. రాత్రి సమయంలో నలుగురు వ్యక్తులు ఇంట్లో నుంచి బయటకు వెళ్తుండగా ప్రసాద్ అక్క గమనించింది. అదే విషయాన్ని ఆమె పోలీసులకు చెప్పడంతో భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా హత్య చేయించానని ఒప్పుకుంది. ఐదుగురు నిందితులు వర, నాగేంద్రబాబు, లివింగ్‌స్టన్, మనోహర్, వెంకటసాయి, సాగర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News