- Advertisement -
అమరావతి న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కందుకూరులో గురువారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారని అడిగినందుకు పక్కింటి వ్యక్తిని హత్య చేశారు. ఖాదర్ హుస్సేన్ అనే వ్యక్తి మద్యం తాగి ఇంట్లో వారితో గొడవపడుతుంది. తన ఇంటి ముందు గొడవ పడొద్దని షేక్ జాకీర్ చెప్పాడు. ఆగ్రహంతో షేక్ జాకీర్‌ను ఖాదర్ కత్తితో పొడిచాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే జాకీర్ చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
- Advertisement -