- Advertisement -
‘జైలర్’ చిత్ర విజయానికి ప్రధాన కారణం సూపర్‌స్టార్ రజనీకాంత్ పవర్, ఆయన అభిమానులే కారణమని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అన్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి తొలివారంలో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.375 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను నెలకొల్పింది.
ఈ సందర్భంగా దర్శకుడు నెల్సన్ మాట్లాడుతూ.. “నేను రజనీ వీరాభిమానిని. ఈ స్క్రిప్టుపై తలైవర్‌కు గట్టి నమ్మకం ఉండటం వల్లే ఆయన అభిమానులు ఇంతలా ఎంజాయ్ చేస్తున్నారు”అని అన్నారు.
- Advertisement -