Thursday, January 23, 2025

ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు మెంబర్‌గా నేమాల బెనర్జీ

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు మెంబర్‌గా నేమాల బెనర్జీని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ విద్యుత్ తనిఖీ అధికారి ఎస్. శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బెనర్జీకి నియామకపత్రం అందజేశారు. గత ఏడాది ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు మెంబర్‌ల కోసం నామినేషన్ దాఖలు చేశారు. కానీ నామినేషన్ వేసిన వారిని కాకుండా సంబంధం లేని వ్యక్తికి బోర్డు మెంబర్‌గా నియమించారు. దీనిపై నేమాల బెనర్జీ హైకోర్టులో పిటీషన్ వేశారు. వాటిని పరిశీలించిన కోర్టు నేమాల బెనర్జీని బోర్డు మెంబర్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ వ్యక్తి కాకుండా బి గ్రేడ్ కాంట్రాక్టుకు సంబంధంలేని వ్యక్తికి బి గ్రేడ్ మెంబర్‌గా నియమించడం వల్ల చాలా ఇబ్బందులకు గురయ్యామని ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News