Monday, December 23, 2024

పోస్ట్ ప్రొడక్షన్ లో ‘నేనే సరోజ’

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో కౌశిక్ బాబు, శాన్వి మేఘన జంటగా శ్రీమాన్ గువ్వడవెల్లి దర్శకత్వంలో ఎస్ 3 క్రియేషన్స్ బ్యానర్ పతాకం పై రచయిత డా. సదానంద్ శారద నిర్మిస్తున్న చిత్రం ”నేనే సరోజ” ! ఉరఫ్ కారం చాయ్ అనేది ఉప శీర్షిక. ప్రముఖ నటీనటులు సుమన్, చంద్రమోహన్, ఆనంద్, చక్రపాణి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Nene Saroja Movie in Post Production works

ఈ సందర్బంగా చిత్ర నిర్మాత సదానంద్ శారద మాట్లాడుతూ .. నేడు సమాజంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.. ముఖ్యంగా సమాజంలో ఆడపిల్లల పట్ల ఇంకా చూపుతున్న వివక్షతను ఎదురిస్తూ ఎదిగిన ఈ తరం ఆడపిల్ల కథ ఇది. ఈ పాత్రలో హీరోయిన్ శాన్వి మేఘన చక్కగా నటించింది. అలాగే హీరో కౌశిక్ బాబు నేటి తరం కుర్రకారుకు అద్దం పట్టే పాత్రలో ఆకట్టుకుంటాడు. నటన, డాన్స్, ఫైట్స్ అన్ని విషయాల్లో చాలా చక్కని ప్రతిభ కనబరిచాడు. ఈ సినిమా తెలంగాణ గ్రామీణ జీవితానికి అద్దం పట్టేలా వరంగల్ కోట, ఇక్కడి ప్రధాన ప్రదేశాల్లో షూటింగ్ చేసాం. ఇందులో ముఖ్యంగా ”కారం చాయ్” అన్న పదం ఈ సినిమా ద్వారా ఈ తరం అమ్మాయిలకు అస్త్రం కానుంది అని తెలిపారు.

దర్శకుడు శ్రీమాన్ గుమ్మడవెల్లి మాట్లాడుతూ .. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఆసక్తికరమైన కథ,కథనంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మాత గారు సపోర్ట్ అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసి చిత్రాన్ని ఫిబ్రవరి లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. కౌశిక్ బాబు, శాన్వి మేఘన, సుమన్, చంద్రమోహన్, ఆనంద్, చక్రపాణి, ఆర్ ఎస్ నంద, తపస్వి, వింజమూరి మధు, బిందెల సుధాకర్ తదితరులు నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News