Wednesday, January 22, 2025

‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ ట్రైలర్ రిలీజ్!

- Advertisement -
- Advertisement -

 

Nenu Meeku Baagaa Kaavalasina Vaadini

హైదరాబాద్: కిరణ్ అబ్బవరం హీరోగా ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ సినిమా రూపొందింది. ఫ్యామిలీ ఎంటర్టయినర్ జోనర్లో నడిచే కథ ఇది. కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య ఈ సినిమాను నిర్మించింది. శ్రీధర్ గాదె దర్శకత్వం వహించిన ఈ సినిమాతో కథనాయికగా సంజన ఆనంద్ పరిచయం కానుంది.

తాజాగా ఈ సినిమా  ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ‘’కాస్ట్యూమ్స్ .. కళ్లజోడు చూస్తే అర్థం కావడం లేదూ .. మనం ఊరమాస్’’ అంటూ తన కేరక్టర్ గురించి కిరణ్ ఇచ్చిన ఇంట్రడక్షన్… ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. ఈ సినిమాలో కిరణ్ క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ప్రేమ .. పెళ్లి .. తండ్రీకూతుళ్ల ఎమోషన్స్ కి సంబంధించిన డ్రామాతో ఈ సినిమా నడుస్తుందనే విషయం ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే మణిశర్మ  పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎస్వీ కృష్ణారెడ్డి కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను ఈ నెల 16వ తేదీన విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News