Wednesday, January 22, 2025

జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథంలో ‘నేనుసైతం’ ప్రస్థావన

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ప్రచురించిన మహబూబాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం గ్రంథంలో ‘నేనుసైతం’ స్వచ్చంద సంస్థ గురించి ప్రస్తావించారని ఆ సంస్థ వ్యావస్థాపకులు మహ్మద్ సుభానీ, కార్యదర్వి సలీమ తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యాలపై ప్రజల్లో కనీస అవగాహన కల్పించాలనే లక్షంతో చేస్తున్న సమాజ సేవలను ప్రస్థావిస్తూ ఈ గ్రంథంలో 225వ పేజీలో నేనుసైతం సేవలను ప్రస్తుతించారని వారు పేర్కోన్నారు. ప్రజాచైతన్యాన్ని మెరుగుపర్చడం కోసం స్వతహాగా పాత్రికేయుడైన సుభాని నేతృత్వంలో నిర్వహిస్తున్న జాగృతి వారపత్రిక వివరాలను కూడా పొందుపర్చడం విశేషమని వారు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News