Monday, December 23, 2024

హైదరాబాద్‌లో నియోలిథిక్ యుగం నాటి శిలలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నగరంలో నియోలిథిక్ యుగం నాటి శిలలు వెలుగు లోకి వచ్చాయి. దీంతో చారిత్రక పరిశీలకుల దృష్టి ఈ శిలలను రక్షించే అవసరంపై కేంద్రీకృతమైంది. రాతిపై చిత్రాలు, స్కెచ్‌లు వంటి ప్రాచీన శిలల గురించి ఆలోచిస్తున్న తరుణంలో నియోలిథిక్ శిలలపై రెండు చిన్న గొడ్ఢళ్ల వంటి నమూనాలు బయటపడ్డాయని చెబుతున్నారు. జుబ్లీహిల్స్‌ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉండే చోట బిఎన్‌ఆర్ హిల్స్ వద్ద ఇవి బయటపడ్డాయి. ఈ పరిశోధన నగరాన్ని ఆరు వేల సంవత్సరాల వెనక్కు తీసుకెళ్లింది. హైదరాబాద్ నగరంలో నియోలిథిక్ పరికరాలు బయటపడడం మొదటిసారి. అంతకు ముందు హైదరాబాద్ చుట్టు పక్కల జనగామ వంటి ప్రాంతాల్లో నియోలిథిక్ శిలలు బయటపడ్డాయి. నియోలిథిక్ యుగం అంటే పరికరాల తయారీని అభివృద్ధి చేసుకోవడం ప్రారంభించే యుగం. నియోలిథిక్ విప్లవం లేదా మొదటి వ్యవసాయ విప్లవం.

ఈ కాలంలో మానవ సంస్కృతుల్లో విస్తృత స్థాయిలో పరివర్తన వచ్చింది. వేట, సేకరణ నుంచి వ్యవసాయం, స్థిరనివాసం ఏర్పర్చుకునే స్థాయికి మానవ జీవితం అభివృద్ధి చెందింది. మానవ సమాజాలు ఏర్పడి స్థిర నివాసాలు విస్తరించాయి. మొక్కలపై పరిశీలన ప్రారంభమైంది. ప్రయోగాలు చేసే పరిస్థితులు కలిగాయి. ఈ కొత్త పరిజ్ఞానం మొక్కలను పంటలుగా పెంపొందించడానికి దారి తీసింది. 11,700 సంవత్సరాల క్రితం హోలోసిన్ యొక్క భౌగోళిక యుగం నుండి వివిధ రకాల మొక్కలు, జంతువుల పెంపకం, ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిందని చరిత్ర చెబుతోంది. వ్యవసాయం లోనే మొట్టమొదటి చారిత్రాత్మక మార్పుగా చెప్పవచ్చు. దీనినే నియోలిథిక్ విప్లవం అంటున్నారు. అంతవరకు మనిషి ఆహారాన్ని వెతుక్కోవడమే తప్ప పంటలు పండించాలన్న ఆలోచన ఉండేది కాదు. కానీ నియోలిథిక్ యుగంలో వ్యవసాయానికి అంకురార్పణ జరిగింది. దానికి అనుగుణం గానే పరికరాలను తయారు చేసుకునే నాగరికత వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News