- Advertisement -
ఖాట్మండ్ :భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి నేపాల్ జాతీయ ఔషధ నియంత్రణ వ్యవస్థ శనివారం అనుమతించింది. భారత్ తయారు చేసే వ్యాక్సిన్‌ను అనుమతించే మూడో దేశంగా నేపాల్ వచ్చింది. అత్యవసర వినియోగానికి అనుమతించాల్సిందిగా భారత్ బయోటెక్ జనవరి 13న నేపాల్‌ను అభ్యర్థించింది. జనవరి 13న దాఖలైన మూడు దరఖాస్తుల్లో మొదట అత్యవసర వినియోగానికి ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు జనవరి 15న అనుమతి లభించింది. తరువాత చైనాకు చెందిన సినోఫామ్ తయారు చేసిన బిబిఐబిపికర్‌వి వ్యాక్సిన్‌కు ఫిబ్రవరి 17న నేపాల్ అనుమతించింది.
Nepal Allows to Covaxin for Emergency Usage
- Advertisement -