Monday, December 23, 2024

నేపాల్‌లో చైనా యాప్ టిక్‌టాక్‌పై నిషేధం

- Advertisement -
- Advertisement -

ఖాట్మండ్: చైనాకు చెందిన సోషల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌ను నేపాల్ సోమవారం నిషేధించింది. ఈ యాప్ వల్ల దేశంలో సామరస్యం దెబ్బతింటోందని పేర్కొంది. ఈ యాప్‌తో సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతోందన్న కారణంతో నిషేధం విధిస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్టు నేపాల్ ప్రభుత్వ అధికార ప్రతినిధి, ఐటీ, కమ్యూనికేషన్ మంత్రి రేఖా శర్మ తెలిపారు. ఫేస్‌బుక్, ఎక్స్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు తమ అనుబంధ కార్యాలయాలను నేపాల్‌లో ఏర్పాటు చేయాలని ఇదే కేబినెట్ బేటీలో నిర్ణయించారు.

త్వరలో నిర్దిష్ట గడువు నిర్ణయించి ఆపై నిషేధం అమలు చేస్తామని రేఖాశర్మ స్పష్టం చేశారు. నేపాల్‌లో టిక్‌టాక్ ద్వేషపూరిత ప్రసంగాలను ప్రోత్సహిస్తోందన్న విమర్శ ఉంది. గడిచిన నాలుగేళ్లుగా 1600కు పైగా సైబర్ క్రైమ్ కేసులు ఈ యాప్‌పై నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నేపాల్ సైబర్ బ్యూరో పోలీస్‌లు , హోం మంత్రిత్వశాఖతో టిక్‌టాక్ ప్రతినిధులు ఓ వారం క్రితం భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం నిషేధం విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News