Thursday, January 23, 2025

నేపాల్ చరిత్రకారుడు సత్యమోహన్ జోషి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Nepal historian Satya Mohan Joshi passes away

ఖాట్మండు : నేపాల్ చరిత్రకారుడు, సాహితీవేత్త సత్యమోహన్ జోషి ఇకలేరు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న 103 ఏళ్ల జోషి… ఖాట్మండు లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు జోషిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఆరోగ్యం మెరుగుపడడంతో డిశ్చార్జి చేశారు. కానీ డెంగీ ఫీవర్ రావడంతో ఇటీవల మళ్లీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. జోషి మృతికి నేపాల్ లోని భారత రాయబార కార్యాలయం సంతాపం ప్రకటించింది. జోషి 1919లో లలిత్‌పూర్ లోని పటాస్‌లో జన్మించారు. ఆయన నేపాల్ చరిత్ర, సాహిత్యం, సంస్కృతికి సంబంధించి 60 కి పైగా పుస్తకాలు రాశారు. దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా నేపాల్ ప్రభుత్వం ఆయనను పలు పురస్కారాలతో పలు పురస్కారాలతో సత్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News