Friday, December 20, 2024

పర్వతారోహకులకు నేపాల్ గౌరవ సత్కారం

- Advertisement -
- Advertisement -

ఖాట్మండ్ : ఎవరెస్ట్ శిఖరాన్ని ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గే మొదటిసారి అధిరోహించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని నేపాల్ నిర్వహించింది. ఈ సందర్భంగా రికార్డు సాధించిన షెర్పా గైడ్లను, పర్వతారోహకులను సోమవారం సత్కరించింది. 1953 మే 29న న్యూజిల్యాండ్‌కు చెందిన తేనెటీగల పెంపకం దారుడు హిల్లరీ ఆయన షెర్పాగైడ్ నార్గే ప్రపంచం లోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించారు.

ఈ 70 వ వార్షికోత్సవ కార్యక్రమానికి వేలాది మంది షెర్పాగైడ్లు, ప్రభుత్వఅధికారులు పాల్గొన్నారు. వీరంతా “హిమాలయాలను రక్షించండి ” అన్న నినాదంతో కూడిన బ్యానర్లు ప్రదర్శించారు. గౌరవం పొందిన వారిలో షెర్పా గైడ్లు కమిరిటా, శాను షెర్పా, ఉన్నారు. కమిరిటా 28 సార్లు ఎవరెస్ట్‌ను అధిరోహించి రికార్డు సాధించారు. శాను షెర్పా ప్రపంచం లోని అత్యున్నత 14 పర్వత శిఖరాలను రెండు సార్లు అధిరోహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News