Wednesday, January 22, 2025

గోవాలో అదృశ్యమైన నేపాల్ మేయర్ కూతురు!.. ఎలా దొరికిందంటే…

- Advertisement -
- Advertisement -

ఆమె పేరు ఆర్తీ హమాల్. నేపాల్ లోని ధంగదీ సబ్ మెట్రోపాలిటన్ నగరానికి మేయర్ అయిన గోపాల్ హమాల్ కుమార్తె. ఆర్తీ పనాజీలోని ఓషో ధ్యాన కేంద్రం సభ్యురాలు. తరచూ గోవాకు వచ్చి కొన్ని నెలలపాటు ఇక్కడే ఉంటూ ధ్యానంలో మునిగిపోవడం ఆమెకు అలవాటు. ఈ క్రమంలో ఆర్తీ రెండు నెలలుగా గోవాలోనే ఉంటున్నారు. అయితే హోలీ రోజునుంచి ఆమె కనిపించట్లేదు. చివరిసారిగా ఆమెను జోర్బా బీచ్ లో చూసినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పారు. దీంతో మేయర్ గోపాల్ హమాల్ కుటుంబం మొత్తం గోవాకు వచ్చేసింది. ఆర్తీకోసం వెతకటం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు గోపాల్ సామాజిక మాధ్యమాల్లోనూ తన కూతురు అదృశ్యమైన విషయాన్ని పోస్ట్ చేశారు.

అయితే రెండు రోజుల  తర్వాత ఆర్తీ ఆచూకీ దొరికిందంటూ స్వయంగా గోపాల్ మళ్లీ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. తన కుమార్తె క్షేమంగానే ఉన్నదని, ఆమె ఆచూకీకోసం వెతికినవారందరికీ ధన్యవాదాలనీ గోపాల్ పేర్కొన్నారు. ఉత్తర గోవాలోని మాండ్రెమ్ లోని ఒక హోటల్లో ఆర్తీ ఉన్నట్లు పోలీసులు కూడా స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News